వెండి ధర రూ.7 వేలు జంప్.. బంగారం@రూ. 1లక్షా19వేల500

వెండి ధర రూ.7 వేలు జంప్.. బంగారం@రూ. 1లక్షా19వేల500

వెండి ధరలు సోమవారం రూ. 7,000 పెరిగి జాతీయ రాజధానిలో కిలోకు రూ. 1.5 లక్షల వద్ద ఆల్​-టైమ్​ గరిష్టాన్ని తాకాయి.బలమైన అంతర్జాతీయ ట్రెండ్స్​ వల్ల  బంగారం కూడా రూ. 1,500 పెరిగి, 10 గ్రాములకు రూ. 1,19,500కి చేరిందని ఇండియా సరాఫా అసోసియేషన్​ తెలిపింది. 

99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి ధర రూ. 7,000 పెరిగి కిలోకు రికార్డు స్థాయిలో రూ. 1,50,000కు ఎగిసింది. 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం  ధర రూ. 1,500 పెరిగి జీవితకాల గరిష్టం రూ. 1,19,500 చేరుకుంది. దీనికి ముందు సెషన్​లో ఇది 10 గ్రాములకు రూ. 1,18,000 వద్ద ఉంది. 

బలమైన అంతర్జాతీయ డిమాండ్​, కొనసాగుతున్న భౌగోళికరాజకీయ ఆర్థిక అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.