భర్త సమాధి వద్ద పెళ్లి రోజు

భర్త సమాధి వద్ద పెళ్లి రోజు

భర్త కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసినా ఆయనపై ఉన్న ప్రేమను గుండెల్లో పదిలంలా దాచుకుంది. ఎంత ప్రయత్నించినా భర్త జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేకపోయింది ఓ భార్య.పెళ్లి రోజు భర్త కళ్లముందు కనిపించకపోవడంతో తట్టుకోలేకపోయింది. ఏకంగా ఆయన సమాధి వద్దకు వెళ్లి పెళ్లి రోజు జరుపుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన సుదర్శన్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 2014 మార్చి 3 న అతనికి ప్రవళికతో వివాహం జరిగింది. అతను ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకునేవారు. ఈసారి భర్త భౌతికంగా దూరమైనా అతనితో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ భర్త సమాధిని పూలతో అందంగా అలంకరించి కేక్ కట్ చేసి ప్రవళిక పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సంఘటన చూసిన వారి హృదయాలను కలచివేసింది.

మరిన్ని వార్తల కోసం

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య

ఏప్రిల్‌ 25న యాదాద్రిలో శివాలయం పునఃప్రారంభం