
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె గోపిచంద్ అకాడమీలో మూడు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు. రోజు రోజుకీ పర్యావరణం క్షీణిస్తుందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటిన సింధు… మరో ముగ్గురు ప్రముఖులకు కూడా ఆమె ఛాలెంజ్ విసిరారు. వారిలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు.