నార్సింగిలో కోటిన్నర విలువ చేసే డ్రగ్స్‌ పట్టివేత

నార్సింగిలో కోటిన్నర విలువ చేసే డ్రగ్స్‌ పట్టివేత

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మరోసారి భారీ‎గా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. కోటిన్నర విలువ చేసే 650 గ్రాముల హెరాయిన్‎ను బుధవారం (జూలై 2) శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు. కాగా, నార్సింగిలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగ్‎ను పరిశీలించగా.. అందులో నిషేధిత హెరాయిన్‎ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే హెరాయిన్‎ను స్వాధీనం చేసుకున్నారు.

సీజ్ చేసిన 650 గ్రాముల హెరాయిన్ విలువ కోటిన్నర ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. హెరాయిన్ రాజస్థాన్‎లో కొనుగోలు చేసి హైదరాబాద్‎కు తరలించినట్లు గుర్తించారు. తానే హెరాయిన్ కంజూమ్ చేస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హెరాయిన్ విక్రయించిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసి.. అతడి కోసం గాలింపు చేపట్టారు నార్సింగ్ పోలీసులు. 

►ALSO READ | హైదరాబాద్ మాదాపూర్ లో దారుణం: బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపిన కొడుకు...