హైదరాబాద్ మాదాపూర్ లో దారుణం: బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపిన కొడుకు...

హైదరాబాద్ మాదాపూర్ లో దారుణం: బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపిన కొడుకు...

ఆన్ లైన్ బెట్టింగ్ సామాన్యుల పాలిట యమపాశంగా తయారవుతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఇంకొంతమంది బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకొని హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. హైదరాబాద్ మాదాపూర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడిన ఓ యువకుడు.. బెట్టింగ్ ఆడద్దని అన్నందుకు ఏకంగా తన తండ్రిని హతమార్చాడు. మంగళవారం ( జులై 1 ) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటుపడ్డ రవీందర్ అనే యువకుడు వనపర్తిలో ఉన్న తమ స్థలం అమ్మగా వచ్చిన డబ్బును కాజేసి బెట్టింగ్ లో పెట్టాడు. తండ్రి హనుమంత్ నాయక్ స్థలం అమ్మగా వచ్చిన రూ. 6 లక్షలు ఇంట్లో తెచ్చి పెట్టగా.. అందులో రూ. 2 లక్షల 50 వేలు కాజేశాడు రవీందర్. సదరు డబ్బు విషయమై కొద్ది రోజులగా తండ్రి అడుగుతుండగా..ఫ్రెండ్ కి అవసరం ఉంటే ఇచ్చాను అని చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చాడు రవింద్రర్ నాయక్.

►ALSO READ | కొడుకును కూతురిలా రెడీ చేసి చూసుకుని.. కుటుంబం మొత్తం వాటర్ ట్యాంక్లో శవాలై..

మంగళవారం మధ్యాహ్నం  12 గంటల సమయంలో తన ఫ్రెండ్ డబ్బులు తిరిగి ఇస్తున్నాడని నమ్మించి తండ్రిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు రవింద్రర్ నాయక్.నిర్జిన ప్రదేశంలో తండ్రిని కత్తితో గొంతులో పొడిచి చంపేశాడు. వేంటనే సోఫా కాలనిలో నివాసం ఉంటున్న తన బావకు ఫోన్ చేసి తన తండ్రి పోడుచుకోని చనిపోయాడని చెప్పి నమ్మించాడు రవింద్రర్ నాయక్..

ఘటనాస్థలానికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.