సమ్మెబాట పడితే ఎస్మా తప్పదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్..

సమ్మెబాట పడితే ఎస్మా తప్పదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్..

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న క్రమంలో వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది టీటీడీ. సమ్మె బాట పడితే ఎస్మా చట్టం అమలు చేస్తామంటూ హెచ్చరించింది టీటీడీ. స్విమ్స్ లో విధులు నిర్వహిస్తున్న  శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పోరేషన్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొంత కాలంగా పలు రకాల కోరికలను కోరుతూ విధులను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నారని , యాజమాన్యం చాలా సామరస్యంగా పరిష్కరించాలని భావిస్తున్నట్లు తెలిపింది టీటీడీ. సదరు ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించింది.

స్విమ్స్ లో ఎస్మా చట్టం అమలులో ఉన్నందున సమ్మె నోటిస్  ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది టీటీడీ. వైద్య సేవలకు  ఆటంకం కల్గిస్తే విధుల నుండి తొలగించే నిబంధన ఉందని..  తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను కోరింది టీటీడీ. విధులను బహిష్కరించి సమ్మెకు దిగితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

స్విమ్స్ తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో నిరసనలకు దిగితే చట్టప్రకారం చర్యలు తప్పవని తెలిపింది టీటీడీ. విధులను బహిష్కరించినందుకుగాను,  ఒకసారి ఉద్యోగం తొలగించాక, సదరు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోరనే విషయాన్ని గమనించాలని తెలిపింది టీటీడీ.గతంలో టిటిడిలో విధులు బహిష్కరించినప్పటికీ..  మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నామని... ఈసారి విధుల నుండి తొలగించాక  విధులను బహిష్కరించిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరని టిటిడి తెలిపింది.  

►ALSO READ | తిరుమలలో మామూళ్ల రచ్చ.. షాపు యజమానిపై విజిలెన్స్ సిబ్బంది దాడి..

టిటిడిలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు ధర్నాలు చేయడం, నిరసన నోటీసులు ఇవ్వడం, ఊరేగింపులు చేయడం చట్టప్రకారం నిషేధమని... నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అదేవిధంగా, ఉద్యోగుల విధులకు టిటిడితో సంబంధం లేని బయట వ్యక్తులు ఆటంకం కల్గిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలకు వెనుకాడమని హెచ్చరించింది టీటీడీ.