సింగపూర్ : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–17, 21–18తో ఐదో పుత్రి కుసుమ వార్దాని (ఇండోనేసియా)పై గెలిచింది. దాంతో గతేడాది ఇదే ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. 44 నిమిషాల మ్యాచ్‌లో సింధు తన ట్రేడ్ మార్క్ ఆటతో ఆకట్టుకుంది.
మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ 26–28, 21–15, 21–13తో చెన్ జి యి–ప్రెస్లీ స్మిత్ (అమెరికా)పై గెలిచారు. మెన్స్ సింగిల్స్‌లో ఆయుశ్ షెట్టి 21–11, 14–21, 21–21తో విక్టర్ లాయ్ (కెనడా) చేతిలో, విమెన్స్‌లో ఉన్నతి హుడా 14–21, 10–21తో మియాజాకీ (జపాన్) చేతిలో ఓడారు.
డబుల్స్‌లో అశ్విని భట్–శిఖా గౌతమ్ 16–21, 11–21తో చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ టున్ (చైనీస్‌తైపీ) చేతిలో, కవిప్రియ–సిమ్రన్ సింగ్ 21–18, 13–21, 5–21తో లోపెజ్–లూసియా రొడ్రిగ్వేజ్ (స్పెయిన్) చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్–రుత్విక శివాని 18–21, 20–22తో యాంగ్ పో సుయాన్–హు లింగ్ ఫెంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో, మెన్స్ డబుల్స్‌లో ఎం.ఆర్. అర్జున్–హరిహరన్ 15–21, 13–21తో టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) చేతిలో పరాజయం చవిచూశారు.
