బైజూస్ రవీంద్రన్‌‌‌‌కు జైలు

బైజూస్ రవీంద్రన్‌‌‌‌కు జైలు

న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ ​స్టార్టప్​ బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌‌కు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులను పాటించనందుకు, ఆస్తుల వివరాలను వెల్లడించనందుకు ఈ శిక్ష పడింది.

కోర్టు ఖర్చులుగా 70,500 డాలర్లు (సుమారు రూ.59 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. ఖతార్ ఇన్వెస్ట్‌‌మెంట్ అథారిటీ ఈ కేసు దాఖలు చేసింది.

అమెరికా రుణదాతలు కూడా 1.2 బిలియన్ డాలర్ల లోన్​ రికవరీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ తీర్పుపై రవీంద్రన్ స్పందిస్తూ ఇది కేవలం విధానపరమైన ఉత్తర్వు మాత్రమేనని,  మోసం జరగలేదని స్పష్టం చేశారు. దీనిపై అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు.

ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.83 లక్షల కోట్లు) విలువ కలిగిన ఈ ఆన్‌‌లైన్ విద్యా సంస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.