డ్రగ్స్ కేసు.. సింగపూర్​లో మరో ఉరి

డ్రగ్స్ కేసు.. సింగపూర్​లో మరో ఉరి

కౌలాలంపూర్: డ్రగ్స్​ స్మగ్లింగ్ కేసులో సింగపూర్ ప్రభుత్వం మరో వ్యక్తిని ఉరి తీసింది. 54 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసినందుకు గాను మహ్మద్ షాల్లేహ్ అబ్దుల్ లతీఫ్‌‌‌‌ (39) అనే ఖైదీని  గురువారం చాంగి జైల్లో ఉరి తీసినట్లు సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో తెలిపింది. డ్రగ్స్  కేసుల్లో సింగపూర్ సర్కారు గత రెండు వారాల్లో ముగ్గురికి ఉరి శిక్షను అమలు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని ఉరి తీసింది. లతీఫ్‌‌‌‌ 2016లో డ్రగ్స్​​ డెలివరీ చేస్తూ పట్టుబడ్డాడు. అతనికి 2019లో మరణ శిక్ష పడింది. అతడు క్షమాభిక్ష కోరగా.. నిరుడు రిజెక్ట్​ అయింది. కరోనా కారణంగా సింగపూర్ ​ప్రభుత్వం ఉరి శిక్షలను రెండేండ్లు నిలిపివేసింది. నిరుడు మార్చి నుంచి మళ్లీ అమలు చేస్తున్నది.