సింగపూర్: ఇండియా డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్–చిరాగ్ 19–21, 21–17, 21–13తో కాంగ్ హై జింగ్–ఆరోన్ టాయ్ (మలేసియా)పై నెగ్గారు. సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 19–21, 21–15, 15–21తో కొకి వాట్నాబే (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో సింధు 17–21, 14–21తో టాప్‌సీడ్ అన్ సె యంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడింది. యంగ్ చేతిలో సింధుకు ఇది వరుసగా తొమ్మిదో పరాజయం. 48 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చూపెట్టలేకపోయింది. యంగ్ కొట్టిన బలమైన స్మాష్‌లను తీయలేక ఇబ్బందిపడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తానీషా క్రాస్టో 16–18 స్కోరు వద్ద చెన్ టాంగ్ జీ–టోహ్ ఈ వీ (మలేసియా) రిటైర్డ్ హర్ట్ అయ్యారు.
