సింగపూర్: ఇండియా షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్.. సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ 10–21, 21–12, 21–18తో ఐదోసీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–17, 21–15తో లు గుయాంగ్ జు (చైనా)పై గెలిచాడు. కిడాంబి శ్రీకాంత్ 20–22, 21–19, 17–21తో లోహ్ కీన్ యు (సింగపూర్) చేతిలో, విమెన్స్ సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21–11, 19–21, 12–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తానీషా క్రాస్టో 21–14, 20–22, 21–13తో వాంగ్ టియాన్ సి–లిమ్ చివు సియాన్ (మలేసియా)పై నెగ్గారు.
