
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో బెస్ట్ఉద్యోగులను యాజమాన్యం ఎంపిక చేసింది. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఏటా ప్రతి ఏరియా నుంచి ఒక్కొక్కరి చొప్పున బెస్ట్ఉద్యోగులను ఎంపిక చేసి యాజమాన్యం సన్మానిస్తుంది. ఇందులో భాగంగా ఈసారి ఎంపికైన బెస్ట్ఉద్యోగుల వివరాలను జనరల్ మేనేజర్ (వెల్ఫేర్) జీవీ కిరణ్కుమార్గురువారం ప్రకటించారు.
భూపాలపల్లి ఏరియా కేటీకే–1 ఇంక్లైన్కు చెందిన ఎం. మురళి (ట్రామర్), ఆర్జీ–3 ఏరియాకు చెందిన కె. కృష్ణ (ఈపీ ఆపరేటర్), అడ్రియాలకు చెందిన ఎన్. మల్లేశ్మల్టీ (జాబ్వర్కర్), ఆర్జీ–2కు చెందిన జె. లక్ష్మయ్య(ఈపీ ఆపరేటర్), ఆర్జీ–1 ఏరియాకు చెందిన ఆర్. లక్ష్మీనారాయణ(ఈపీ ఆపరేటర్), బెల్లంపల్లి ఏరియా గోలేటీ సీహెచ్పీకి చెందిన రాంకిషన్(ఈపీహెల్పర్), మందమర్రి ఏరియా కాశీపేట్కు చెందిన పి. అంకులు (కోల్కట్టర్), శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఎ. మధుసూదనరావు (ఫోర్మెన్).
మణుగూరు ఏరియా పీకే ఓసీ–2కు చెందిన ఎ. ఆంజనేయులు(ఈపీ ఆపరేటర్), కొత్తగూడెం ఏరియా పీవీకే–5 ఇంక్లైన్కు చెందిన బి.కుమారస్వామి (టెండాల్), ఎస్టీపీపీకి చెందిన జె. పర్సయ్య (సీనియర్అసిస్టెంట్), కార్పొరేట్ ఆఫీసుకు చెందిన జి. వెంకటరావు (సీనియర్లా ఆఫీసర్) బెస్ట్ఎంప్లాయీస్ గా సెలెక్ట్ అయ్యారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శుక్రవారం స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కంపెనీ సీఎండీ ఎన్. బలరాంతో పాటు డైరెక్టర్లు సన్మానించనున్నట్టు ఆయన వివరించారు.