సింగరేణిలో ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్..విచారణ 22వ తేదీకి వాయిదా

సింగరేణిలో ఎన్నికల నిర్వహణపై  హైకోర్టులో పిటిషన్..విచారణ 22వ తేదీకి వాయిదా

గోదావరిఖని, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితి ఈ నెల 8వ తేదీతో ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించేలా చూడాలంటూ టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు సెప్టెంబర్​ 22వ తేదీకి వాయిదా వేసింది.

 మరో వైపు.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి మంగళవారం హైదరాబాద్​లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్), సింగరేణి సీఎండి జ్యోతి బుద్ధ ప్రకాశ్, డైరెక్టర్ గౌతం పొట్రును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మిక సంఘాల ఎన్నికలు జరిగే వరకు అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలని కోరారు.