అమెరికాలో గుండెపోటుతో సింగరేణి ఎంప్లాయ్ మృతి

అమెరికాలో గుండెపోటుతో సింగరేణి ఎంప్లాయ్ మృతి

గోదావరిఖని, వెలుగు : అమెరికాలో గుండెపోటుతో సింగరేణి ఎంప్లాయ్ చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్​హౌస్​కాలనీకి చెందిన పెరుక ప్రకాశ్(55),  సింగరేణి రామగుండం ఏరియా ఆర్జీ –-3 డివిజన్​ఓపెన్​కాస్ట్​-–2 ప్రాజెక్ట్​లో జనరల్​అసిస్టెంట్. కాగా ప్రకాశ్ దంపతులు కొద్దిరోజుల కింద అమెరికాలోని ఆస్టిన్​సిటీలో ఉండే కూతురు వద్దకు వెళ్లారు.

 అక్కడ ఈనెల 25న ఉదయం ప్రకాశ్ వాకింగ్​చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబసభ్యులు సోమవారం తెలిపారు. ఈనెల 31న ఆయన డెడ్ బాడీని గోదావరిఖనికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.