హైదరాబాద్, వెలుగు: వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఇందుకు సంబంధించిన రూ.10.25 కోట్ల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండి బలరాం గురువారం సెక్రటేరియట్‌లో అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు, అధికారులకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, లక్ష్మీపతి గౌడ్, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కె.రాజ్ కుమార్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ సి.త్యాగరాజన్, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ నర్సింహులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు కూడా సీఎంఆర్ఎఫ్ కు రూ.2లక్షల 50 వేలు విరాళం అందించారు. ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు సీఎం సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందించారు. మోల్డ్‌టెక్ ఇండస్ర్టీస్ వైస్ ప్రెసిడెంట్ రానా ప్రతాప్ సీఎంఆర్ఎఫ్కు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు.