- సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వినియోగదారులకు అవసరమైన విధంగా నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బదావత్ వెంకన్న పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్ ప్రాజెక్టు, ప్లానింగ్ కొప్పుల వెంకటేశ్వర్లుతో కలిసి కొత్తగూడెం ఏరియాలోని పీవీకే–5 ఇంక్లైన్ మైన్ ఆయన సందర్శించారు. అనంతరం వీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీకే–5 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ నుంచి రోజూ 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. వీకే ఓసీలో త్వరిత గతిన బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తిలో రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ ప్రోగ్రాంలో ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి, ఆఫీసర్లు కె. సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, నరసింహరావు, శ్యాంప్రసాద్, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.
