- సింగరేణి డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు
కోల్‌బెల్ట్, వెలుగు: సోలార్ పవర్‌ను నిల్వ చేసి సద్వినియోగం చేసుకునే వినూత్న ఆవిష్కరణకు సింగరేణి శ్రీకారం చుట్టిందని, ఇందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ఏర్పాటు చేసిందని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన మందమర్రి ఏరియాలో పర్యటించారు.
మందమర్రిలోని ప్రాణహితకాలనీ వద్ద ఉన్న 28 మెగావాట్ల సోలార్‌పవర్ ప్లాంట్‌లోని బ్యాటరీ ఎనర్జీస్టోరేజ్ సిస్టంను ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు. మెగావాట్ కెపాసిటీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్పద్ధతిలో పవర్ నిల్వ చేసే తీరును పరిశీలించారు.
అనంతరం ఏరియా జీఎం ఆఫీస్‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కేకే ఓసీపీలోని వ్యూపాయింట్ వద్దకు వెళ్లి బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, బొగ్గు రవాణా తీరును పరిశీలించారు. డైరెక్టర్వెంట ఏరియా జీఎం రాధాకృష్ణ, ఓసీపీ పీవో మల్లయ్య, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవత్ఝూ, మేనేజర్ రామరాజు, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
