V6 News

వృత్తివిద్యా కోర్సు శిక్షణకు సింగరేణి ఆహ్వానం : డీజీఎం అశోక్

వృత్తివిద్యా కోర్సు శిక్షణకు సింగరేణి ఆహ్వానం : డీజీఎం అశోక్

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీజీఎం(పర్సనల్)​ అశోక్​తెలిపారు. టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, ఫ్యాషన్ ​డిజైనింగ్​ అంశాలపై 3 నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు.

ఈ కోర్సులకు సింగరేణి, మాజీ ఉద్యోగుల భార్యలు, వారి పిల్లలు, భూ నిర్వాసితులు, మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీ ప్రాజెక్ట్, ఆర్కేపీ ఓసీపీ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలు, రామకృష్ణాపూర్​ చుట్టుపక్కల గ్రామాల మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు మందమర్రి ఏరియా సింగరేణి పర్సనల్​ డిపార్ట్​మెంట్, సింగరేణి సేవా సమితిలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.