
- దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై మహిళలను ఆపరేటర్లుగా నియమించేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు శనివారం అన్ని గనులు, శాఖలకు సర్క్యులర్‌లు జారీ చేసిన కంపెనీ.. ఓపెన్‌కాస్ట్ గనుల్లో మహిళలు భారీ యంత్రాలను నడపడానికి సింగరేణి చరిత్రలో మొదటిసారిగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 35 ఏండ్లలోపు వయసు, 7వ తరగతి పాస్, శారీరక సామర్థ్యం, టూవీలర్, ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం తప్పనిసరి.