Singareni Jung Siren: వాస్తవ ఘటనల ఆధారంగా సింగరేణి జంగ్ సైరన్

Singareni Jung Siren: వాస్తవ ఘటనల ఆధారంగా సింగరేణి జంగ్ సైరన్

సింగరేణి జంగ్ సైరన్(Singareni Jung Siren).. తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా.  1999 సంవత్సరం సింగరేణిలో జరిగిన యధార్థ సంఘటనల  ఆధారంగా వస్తున్న ఈ సినిమాకు సింగరేణి జంగ్ సైరన్ టైటిల్ ఫిక్స్ చేయగా.. ది అండర్ గ్రౌండ్ లైవ్స్ అనే  ట్యాగ్ లైన్ ను జతచేశారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు జార్జ్ రెడ్డి ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి కథ అందిస్తుండగా.. దర్శకుడు వివేక్ ఇనుగుర్తి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే సింగరేణి జంగ్ సైరన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 

Also Read: గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ కూతురు శ్రీజ.. ఇన్స్టా పోస్ట్ వైరల్

అయితే.. ఈ సినిమాలో నటించేబోయే నటీనటులు, ఇతర వివరాలను ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1(మేడే) రోజున ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. కెమెరామెన్: రాకీ వనమాలి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్: హరీశ్ మధురెడ్డి, కథ: జీవన్ రెడ్డి, దర్శకత్వం: వివేక్ ఇనుగుర్తి.. తదితరులు పనిచేయనున్నారు.