భూ నిర్వాసితుల అరెస్ట్.. లద్నాపూర్ లో టెన్షన్ టెన్షన్..

భూ నిర్వాసితుల అరెస్ట్.. లద్నాపూర్ లో టెన్షన్ టెన్షన్..

పెద్దపల్లి : రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూ నిర్వాసితుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కొందరు నిరసనకు దిగారు. పురుగుల మందు డబ్బాలు తీసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతో పాటు ఇండ్ల కూల్చివేత ఆపేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

సోమవారం రాత్రి లద్నాపూర్ గ్రామానికి వచ్చిన సింగరేణి యాజమాన్యం, అధికారులు జేసీబీలతో ఇండ్లు కూల్చే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న భూ నిర్వాసితుల అరెస్ట్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 283 ఇండ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పించాలని గత 70 రోజుల నుండి లద్నాపూర్ నిర్వాసితులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. అయినా పట్టించుకోని యాజమాన్యం ఇళ్లను కూల్చేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకున్న దాదాపు 100 మంది నిర్వాసితులను అరెస్ట్ చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్కు తరలించారు. తాజాగా సింగరేణి అధికారులు జేసీబీల సాయంతో ఇండ్లను నేలమట్టం చేస్తున్నారు.