గులాబీ లీడర్లు చెప్పినోళ్లకే క్వార్టర్లు

గులాబీ లీడర్లు చెప్పినోళ్లకే క్వార్టర్లు

గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంలోని 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో కష్టపడి పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం ప్రయారిటీ ఇవ్వట్లేదు. బొగ్గు ప్రొడక్షన్​లో కీ రోల్ పోషిస్తున్న వారికి క్వార్టర్లు ఇవ్వకుండా అధికార పార్టీ లీడర్లు చెప్పినోళ్లకే కేటాయిస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లతో వచ్చిన వారికే ఆఫీసర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని ఏరియాల్లో సిఫార్సు లెటర్లతో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లో రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు నామినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్వార్టర్లను కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. టీఆర్ఎస్​ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ అవకాశం కల్పించడంతో పరిస్థితి మరీ దిగజారిందని అంటున్నారు. 

వాస్తవంగా ఇలా..

కంపెనీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు సీనియార్టీ ఆధారంగా యాజమాన్యం క్వార్టర్లను కేటాయిస్తుంది. కార్మికులు, ఉద్యోగులకైతే డి– టైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టి2– టైప్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ2‌‌‌‌‌‌‌‌– టైప్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్లు, అధికారులకైతే ఎ– టైప్, సి– టైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ– టైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్లను అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ప్రతి నెలా ఆయా ఏరియాల్లోని మైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓసీపీ, డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల వద్ద కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్ల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియార్టీ ప్రాతిపదికన కేటాయింపులు చేస్తారు. 

కరోనాతో కలిసొచ్చిన అవకాశం

కరోనా నేపథ్యంలో మేనేజ్​మెంట్​ఏడాదిగా  కౌన్సెలింగ్ నిర్వహించడం బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. అధికార పార్టీ నాయకులకు ఈ అవకాశం కలిసొచ్చింది. గతంలో కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్వారా క్వార్టర్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నవారు తమకు అది నచ్చలేదని, మరో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ కావాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు తీసుకొచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారులు కూడా వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ కార్యకలాపాల కోసం క్వార్టర్లు కావాలని రిక్వెస్ట్​పెట్టుకుంటే సింగరేణి ఆఫీసర్లు కేటాయిస్తున్నారు. రిటైర్డ్ కార్మికులు, కార్మిక నాయకులు అధికార పార్టీ లీడర్లు, యూనియన్ల పేరు చెప్పి ప్రైమ్​లొకేషన్లలోని పెద్ద క్వార్టర్లను తీసుకుంటున్నారు. కొంత మంది అధికారులు రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అయినప్పటికీ పలుకుబడిని ఉపయోగించి నామినల్‌‌‌‌‌‌‌‌ రెంట్​పై క్వార్టర్లు పొందుతున్నారు. 

నష్టపోతున్న ఎంప్లాయీస్

లీడర్ల జోక్యంతో ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న క్వార్టర్లు కౌన్సిలింగ్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రాకుండా పోతున్నాయి. దీంతో సీనియర్‌‌‌‌‌‌‌‌ కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు నష్టం జరుగుతోంది. చివరకు పగుళ్లుదేలిన, కూలిపోయే దశకు వచ్చిన, వర్షపు నీటితో నిండిపోయే క్వార్టర్లలో ఉంటూ బొగ్గు ప్రొడక్షన్​కోసం శ్రమిస్తున్నారు.ఈ విషయంలో సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఖాళీ చేయని మాజీలు

వివిధ జిల్లాల్లో మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు కూడా సింగరేణి క్వార్టర్లపై కన్నేశారు. ప్రజాప్రతినిధికి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ కేటాయించకపోతే తలనొప్పులు తప్పవని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వారికి తలొగ్గుతోంది. కానీ కొందరు పదవీ కాలం ముగిశాక కూడా క్వార్టర్లను ఖాళీ చేయడం లేదు. నామినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తీసుకుని సింగరేణి సరఫరా చేసే నీళ్లు, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకుంటుకుంటున్నారు. ఎవరిపైన అయినా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఒత్తిడి తెస్తే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి లెటర్లు ఇప్పించి జబర్దస్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాటిలోనే ఉంటున్నారు.