
- కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు వేదిక
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి స్పోర్ట్స్క్యాలెండర్రిలీజైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1.25కోట్ల బడ్జెట్‌కు యాజమాన్యం ఆమోదం తెలిపింది. వచ్చే నెల 23 నుంచి డిసెంబర్18 వరకు సింగరేణి వ్యాప్తంగా యాన్యువల్గేమ్స్ అండ్ స్పోర్ట్స్ షెడ్యూల్‌ను కూడా రూపొందించింది. ప్రతి ఏడాది కార్మికులకు సింగరేణి పోటీలను నిర్వహిస్తుంది.
డిపార్ట్మెంట్స్, ఏరియా, రీజనల్స్థాయిలో ప్రతిభ చూపిన కార్మికులను కోల్ఇండియా పోటీలకు పంపుతుంది. గేమ్స్‌కు అవసరమైన మెటీరియల్, క్రీడాకారులకు యూనిఫాం, షూస్, మెడల్స్, గిఫ్ట్స్ ఇతరత్రా అవసరాలకు నిధులను ఉపయోగించుకోవాలి. వాటిలోంచి ఏరియా స్థాయిలో జరిగే గేమ్స్అండ్స్స్పోర్ట్స్కు కేటాయింపు ఉంటుంది. కాగా.. కోల్ ఇండియా స్థాయిలో నిర్వహించే కబడ్డీ పోటీలకు ఈసారి సింగరేణి ఆతిథ్యమివ్వనుంది.
గతంలోనూ కబడ్డీ పోటీలను నిర్వహించింది. దేశంలోనే ప్రముఖ బొగ్గు సంస్థల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొని సత్తా చాటుతారు. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో పోటీలను నిర్వహించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.
గేమ్స్ షెడ్యూల్ ఇలా..
సెప్టెంబర్ 23,24 తేదీల్లో భూపాలపల్లిలో బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్(మెన్, ఉమెన్) పోటీలు. 25,26 తేదీల్లో ఆర్జీ_3 ఏరియాలో షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అక్టోబర్ 7,8 తేదీల్లో బెల్లంపల్లిలో క్యారమ్స్, చెస్, 14,15 తేదీల్లో ఆర్జీ_2 లో కబడ్డీ , బాల్ బ్యాడ్మింటన్, 28, 29 తేదీల్లో ఇల్లెందు లో వాలీబాల్, నవంబర్ 4,5 తేదీల్లో మందమర్రిలో కల్చరల్ పోటీలు ఉంటాయి. 18,19 తేదీల్లో కార్పొరేట్ లో లాన్ టెన్నిస్, బాస్కెట్ బాల్, 25, 26 తేదీల్లో ఆర్జీ _1లో హాకీ, డిసెంబర్ 9,10 తేదీల్లో శ్రీరాంపూర్ లో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, త్రోబాల్, 16,18 తేదీల్లో కొత్తగూడెంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తారు.