
మందమర్రి/జైపూర్, వెలుగు:మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్‌పవర్ ప్లాంట్ కరెంట్ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా 250 ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుత్ కేంద్రాల కన్నా సింగరేణి థర్మల్పవర్ప్లాంట్అత్యధిక ప్లాంట్ లోడ్‌ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించినందుకు సింగరేణి ఎస్టీపీపీ ఉద్యోగులు, ఆఫీసర్లను గురువారం సీఎండీ ఎన్. శ్రీధర్ అభినందించారు. 2026 నాటికి సింగరేణి సంస్థ మూడు వేల మెగావాట్ల థర్మల్, సోలార్‌పవర్‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
అత్యుత్తమ పీఎల్ఎఫ్
2022–-23 ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో జైపూర్సింగరేణి థర్మల్పవర్ప్లాంట్90.86 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించిన ఆరేండ్లలోనే దేశంలోని 25 అత్యుత్తమ పవర్ప్లాంట్ల జాబితాలో అగ్రస్థానలో నిలవడం పట్ల సింగరేణి యాజమాన్యం హర్షం ప్రకటించింది. చత్తీస్‌గఢ్‌లోని ఎన్టీపీపీసీ కోర్బా సూపర్పవర్థర్మల్ స్టేషన్90.01 శాతం పీఎల్‌ఎఫ్‌తో రెండో స్థానం, మధ్యప్రదేశ్‌లోని సింగ్రోళీ థర్మల్‌పవర్ ప్లాంట్89.94 శాతం పీఎల్‌ఎఫ్‌తో మూడో స్థానంలో నిలిచాయి.
నాలుగుసార్లు వంద శాతం..
2016 సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైన జైపూర్సింగరేణి థర్మల్పవర్ప్లాంట్ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు 100 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. 2018 సెప్టెంబర్, 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి, 2022 మార్చి నెల్లలో ఈ ఘనత సాధించింది. రెండు యూనిట్లు ఉన్న ప్లాంట్‌లో రెండో యూనిట్10 సార్లు, ఒకటోయూనిట్ ఏడు సార్లు వంద శాతం పీఎల్ఎఫ్దాటినట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. ఆరేండ్లలో సింగరేణి థర్మల్పవర్ప్లాంట్ రాష్ట్ర అవసరాల కోసం 51,547 మిలియన్‌యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పవర్‌ప్లాంట్‌లో మరో 800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.
సోలార్ పవర్‌లోనూ హవా..
థర్మల్పవర్ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న సింగరేణి సంస్థ సోలార్ పవర్జనరేషన్లోనూ అదే జోరు సాగిస్తోంది. ఇప్పటికే 219 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసి పవర్ఉత్పత్తి చేస్తోంది. మూడో విడత 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా జైపూర్ ఎస్టీపీపీ రిజర్వాయర్‌లో 15 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్సోలార్ ప్లాంట్నిర్మిస్తోంది. ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు 2026 నాటికి మరో 800 మెగావాట్ల మూడో యూనిట్, ప్రతిపాదిత 300 మెగావాట్ల సోలార్, రాష్ట్ర సర్కార్ పర్మిషన్తో భారీ రిజర్వాయర్లపై మరో 1000 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్‌తో కలిపి 3వేల మెగావాట్ల పవర్‌ను ఉత్పత్తి చేయాలని టార్గెట్‌గా ఎంచుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ గురువారం తెలిపారు. సింగరేణి ఎస్టీపీపీ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించేందుకు కృషి చేయాలని ఉద్యోగులు, ఆఫీసర్లకు పిలుపునిచ్చారు.