బషీర్‌బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్‌యాదవ్ గెలిస్తేనే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని సింగరేణి భూనిర్వాసితుల అసోసియేషన్జనరల్ సెక్రటరీ నాంపల్లి రమేశ్ అన్నారు. బుధవారం రహమత్ నగర్ డివిజన్‌లో నవీన్ యాదవ్‌కు మద్దతుగా సింగరేణి భూనిర్వాసితులు ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ గెలుపుతో నియోజకవర్గం మరింత డెవలప్ అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంది శీను, గౌరవాధ్యక్షుడు రాసమల్ల సంపత్, బిక్కినేని మాధవరావు పాల్గొన్నారు.
యూసఫ్‌గూడలో నవీన్‌యాదవ్ ప్రచారం..
ఉప ఎన్నికల్లో భాగంగా యూసఫ్ గూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పీవీ.రవిశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యదర్శి కొప్పిశెట్టి దినేశ్‌గౌడ్, గురునాథరావు, నాగరాజు, భరత్ కుమార్ పాల్గొన్నారు.
