సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి..

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి..
  • ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్  

గోదావరిఖని, వెలుగు:  సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలు తప్పవని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. బుధవారం గోదావరిఖనిలో యూనియన్​సెంట్రల్​ కమిటీ ఆఫీస్​బేరర్స్​ మీటింగ్​ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ కృషి చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన సొమ్మును ఇష్టానుసారంగా వాడుకుంటోందని ఆరోపించారు.

 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి బకాయిలు బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని ఆరోపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిందన్నారు. వినియోగించిన బొగ్గు, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ప్రభుత్వం రూ.34 వేల కోట్లు సింగరేణికి బకాయిపడిందన్నారు. కాంగ్రెస్​కూడా బకాయిలు చెల్లించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలనే అవలంభిస్తూ సంస్థకు తీరని నష్టం చేస్తుందని విమర్శించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లీడర్లు మిర్యాల రంగయ్య, ఎల్.ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైవీ రావు, మడ్డి ఎల్లా గౌడ్, సమ్మయ్య, వీరభద్రం, లీడర్లు, పాల్గొన్నారు.