నటి మరియు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పంజాబ్ రాష్ట్ర యువతని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ధుమారం రేపుతున్నాయి. ఇటీవలే కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ర్యాలీలో పాల్గొంది. ఇందులోభాగంగా ప్రసంగిస్తూ పొరుగు రాష్ట్రమైన పంజాబ్ డ్రగ్స్‌తో నిండిపోయిందని, రాష్ట్రంలోని యువత మద్యానికి బానిసలయ్యారని, కాబట్టి పంజాబ్ ప్రజల ప్రలోభాలకు ప్రభావితం కావద్దని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో పంజాబ్ యువతపై కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు సెలెబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ప్రముఖ పంజాబీ సింగర్ జస్బీర్ జస్సీ స్పందించాడు. ఇందులో భాగంగా కంగనా రనౌత్ పంజాబ్ యువతను ఉద్దేశించి చెడుగా మాట్లాడటం సరికాదని అన్నారు. అలాగే పంజాబ్ గురించి చెడుగా మాట్లాడడటం ఆపకపోతే గతంలో తన కారులో మద్యం మరియు డ్రగ్స్ సేవించి చేసిన రచ్చ గురించి బయటపెడతానని కంగనా రనౌత్ ని హెచ్చరించాడు.
అలాగే కంగనా రనౌత్ కి మానసిక సమస్యలు ఉన్నాయని ఇలాంటి వ్యక్తులు పార్లెమెంట్ లో కూర్చుని దేశ ప్రజల గురించి నిర్ణయాలు తీసుకోవడం పెను ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్‌న్యూస్
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి కంగనా హిందీలో ఎమెర్జెన్సీ అనే చిత్రంలో నటించింది. కాగా ఈ చిత్రం 1975 సమయంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. దీంతో పంజాబ్ కి చెందిన పలు సిక్కు సంఘాలు ఎమెర్జెన్సీ చిత్ర విడుదలని అడ్డుకున్నాయి. దీంతో అప్పటినుంచి కంగనా ఈ విధంగా పంజాబ్ రాష్ట్రంపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.