దేవర (Devara) కలెక్షన్స్ అప్డేట్స్ ఇస్తూ హీట్ పెంచేస్తున్న మేకర్స్..మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. తాజాగా ‘దేవర’ థర్డ్ సింగిల్ ' దావూదీ' సాంగ్ను ఇవాళ అక్టోబర్ 4నుంచి థియేటర్ ప్రింట్ లో యాడ్ చేశామంటూ మేకర్స్ తెలిపారు.
ఇవాళ శుక్రవారం నుంచి అన్ని స్క్రీన్స్‌లోనూ ఈ పాటను ప్రదర్శించనున్నట్లు ప్రకటించగా.. కొన్ని థియేటర్లు ఉదయం నుంచే పాటను ప్రదర్శించనుండగా, సాయంత్రం సమయానికి పూర్తి స్థాయిలో అన్ని స్క్రీన్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..బాలీవుడ్ క్రేజీ సింగర్ నకాష్ అజీజ్,ఆకాశ కలిసి పాడారు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ అందించారు.
ALSO READ | దేవర మొదటివారం కలెక్షన్లు ఎంతంటే..?
ఇక దావూదీ పాట ప్రతి ఒక్క ఆడియన్ ను స్టెప్పులేసేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ (NTR), జాన్వీ(Janhvi Kapoor) డ్యాన్స్ పెర్ఫార్మన్స్కు షేక్..షేక్..షేక్..అందరూ షేక్ అయ్యారు. దావూదీ సాంగ్ రిలీజ్ రోజు నుంచి వారం రోజులపాటు థియేటర్లో మిస్ అయిన ఫ్యాన్స్కి ఇదొక పండుగనే చెప్పుకోవాలి. దీంతో నేటి నుంచి థియేటర్ ఆడియో బాక్సులు పగిలిపోయేలా ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకు ముఖ్య కారణం ఎన్టీఆర్ జాన్వీ డ్యాన్స్.
To all the fans who have been waiting to get into the KILI KILIYE mood 🕺🏻
— Devara (@DevaraMovie) October 4, 2024
Enjoy #Daavudi at your nearest cinemas now! 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/MIxMveHW8b
'నకేలిసు నడుం గింగిర గింగిరా గింగిరామే..రంగుల పొంగుల బొంగరామే సన్నగా నున్నగా బళ్లెగా చెక్కావే'..'నీ ఏటావాలు చూపే యెన్నెల సాంబ్రాణి...నన్నెక్కించావే పిల్లా రెక్కల గుర్రాన్ని' అనే పదాలకు వీరిద్దరి డ్యాన్స్ బీట్స్ అదిరిపోయాయి. చుట్టమల్లే సాంగ్ కి మెలోడీగా ఊగిపోయిన ఫ్యాన్స్.. ఇక నేటి నుంచి దుమ్ములేపేలా స్టేజిపై డ్యాన్స్ చేయడం పక్కా అని చెప్పేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సినిమా చూసి డిసప్పాయింట్ అయ్యామని సోషల్ మీడియాలో చెప్పకొచ్చిన విషయం తెలిసిందే.