Rahul Sipligunj Wedding: ప్రేమించిన అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌

Rahul Sipligunj Wedding: ప్రేమించిన అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌

టాలీవుడ్ సింగర్, ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యాడు. ఇవాళ గురువారం (2025 నవంబర్ 27న) తెల్లవారుజామున రాహుల్-హరిణ్యల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తన ప్రియురాలు హరిణ్యరెడ్డి మెడలో మూడుముళ్లు వేసి రాహుల్ వివాహబంధంలో అడుగుపెట్టారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లిలో రాహుల్ జంట ఎంతో అందంగా, చక్కటి అలంకారణలో కనిపించి ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా రాహుల్ వివాహానికి విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు.. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో రాహుల్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.  

ఇకపోతే.. 2025 ఆగస్ట్ 17న హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ హోటల్‌లో రాహుల్ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తెనే ఈ హరిణ్యా రెడ్డి. ఆమెకి ఇంస్టాగ్రామ్లో 38.9 Kమంది ఫాలోవర్స్ ఉన్నారు. 

రాహుల్ RRR మూవీలో పాడిన నాటు నాటు పాట ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీలో, ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ సిప్లిగంజ్కు కోటి రూపాయల చెక్ అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.

రాహుల్ సిప్లిగంజ్ పాటలు:

హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్.. పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తన వైవిధ్యమైన గొంతుతో తెలుగులో పాటలు పాడుతూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు ఈ కుర్ర సింగర్. ఓపక్క సింగర్ గా కంటిన్యూ అవుతూనే.. మరోపక్క ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పటికే మనోడు చేసిన సాంగ్స్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఆడియస్న్ కూడా రాహుల్ పాటలంటే పిచ్చెక్కిపోతారు. మరీ ముఖ్యంగా యూత్. 

రాహుల్ 20 ఏళ్ళ వయసులోనే సింగర్గా ఎంట్రీ ఇచ్చాడు. 2009లో జోష్ చిత్రంలో "కాలేజీ బుల్లోడా" సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత దమ్ము సినిమాలో  ‘వాస్తు బాగుందే’, రచ్చ సినిమాలో ‘సింగరేణి ఉంది’, ఛల్ మోహన రంగా సినిమాలో ‘బొమ్మోలే ఉన్నదిరా పోరీ’ వంటి పాటలతో దుమ్మురేపాడు. రంగస్థలం మూవీలో ‘రంగ రంగ రంగస్థలానా’ పాటకు అత్యంత ప్రజాదరణ లభించింది. ఈ క్రమంలోనే RRR మూవీతో ఆస్కార్ సైతం చేసుకున్నాడు. అలాగే, ‘ఓ నా రాహులా’, బోనాలు, వినాయక చవితి తదితర స్పెషల్‌ సాంగ్స్‌తో రాహుల్‌ అదరగొట్టారు.