2026 మొత్తం తన లైఫ్‌లో మ్యూజిక్కే ఉంటుందని, దేశ, విదేశాల్లో లైవ్ షోస్ చేయబోతున్నట్టు పాప్ సింగర్ స్మిత చెప్పింది. తాజాగా ఆమె కంపోజ్ చేసిన ఓజీ×మసక మసక సాంగ్‌ను లాంచ్ చేశారు. స్మిత, నోయల్ నటించిన ఈ సాంగ్‌ని విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశాడు. జార్జ్. సి. విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా, నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు దేవాకట్టా పాల్గొని స్మితకు బెస్ట్ విషెస్ చెప్పారు.
స్మిత మాట్లాడుతూ ‘నార్త్‌లో ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా పాపులర్ అవుతుంది. సౌత్‌లో మాత్రం నేను ఆపినచోటే ఆగిపోయింది. మళ్ళీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. సంక్రాంతికి ఒక పాట వస్తుంది. మేమే పండగలా తీస్తున్నాం. ఆ పాట ఒక ఫెస్టివల్‌లా ఉంటుంది. ఇకపై వరుసగా పాటలు రాబోతున్నాయి. మార్చి చివరి నుంచి లైవ్ షోస్ కూడా ఉంటాయి. హైదరాబాద్, ఆంధ్రాతో పాటు యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో కూడా ఈవెంట్స్ ఉంటాయి. స్మితతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీ అని సింగర్ నోయల్ అన్నాడు.
