
ఓ రాజకీయ నాయకుడి వల్ల తన ఫ్లైట్ మిస్సయిందంటూ సింగర్ శ్రీరామచంద్ర అసహనం వ్యక్తం చేశాడు. పొలిటీషియన్లు ఇలా చేయడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ ఓ ఈ వెంట్ కోసం నేను గోవా వెళ్లాలి. కానీ ఫ్లైట్ మిస్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ కు వచ్చే దారిలో పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ ను బ్లాక్ చేశారు. ఒక పొలిటిషియన్ కోసం రోడ్డు బ్లాక్ చేశారు. దాంతో పబ్లిక్ ఫ్లై ఓవర్ కింది నుంచి పోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అరగంట ఆలస్యం అయ్యింది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. నాతో పాటు మరో 15 మంది కూడా గోవా ప్లైట్ మిస్సయ్యారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ నా విన్నపం ఏంటంటే? రాజకీయ నాయకుల కోసం మా లాంటి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వీటి గురించి ఆలోచించాలి ’ అంటూ వీడియో పోస్ట్ చేశారు.