ఉష నోట శ్రీవల్లి పాట

ఉష నోట శ్రీవల్లి పాట

‘పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైరు’ అని ఐదు భాషల్లోని ప్రేక్షకుల్నీ ఒప్పించి మెప్పించాడు ‘పుష్ప’రాజ్. ముఖ్యంగా పాటలతో ఓ ఊపు ఊపేశాడు. అందులోనూ ‘శ్రీవల్లి’ పాట అయితే అన్ని లాంగ్వేజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సెన్సేషనల్ హిట్టయ్యింది. అందుకే ఈ పాట ఇతర భాషల్లోకీ దూసుకెళ్తోంది. ఆదిత్య మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ ఈ సాంగ్​ని బెంగాలీలో రీక్రియేట్ చేసింది. ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దాన్ని పాడించడం విశేషం. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 28న ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేయనున్నారు. ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగీత సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేశారు ఉష.  ఆవిడ పాడుతున్నారంటే  ‘శ్రీవల్లి’ సాంగ్ బెంగాలీలోనూ సంచలనం సృష్టించే చాన్స్ ఉందన్నమాటే.