దేశంలో 45 వేలు దాటిన కరోనా మరణాలు..

దేశంలో 45 వేలు దాటిన కరోనా మరణాలు..

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 53,601 కరోనా కేసులు నమోదవ్వగా 871 మంది చనిపోయారు.  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 22,68,676కు చేరగా మృతుల సంఖ్య45,257 కు చేరింది. నిన్న ఒక్కరోజే 47 వేల మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 15,83,490 మంది కోలుకున్నారు. ఇంకా 6,39,929 మంది చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 5,24,513 కేసులు నమోదవ్వగా 18,050 మంది చనిపోయారు. ఆతర్వాత తమిళనాడులో 3,02,815 కేసులు,5,041 మంది చనిపోయారు. ఇక 2,35,525 కేసులతో ఆంద్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది.

ప్రస్తుతానికి ఇండియాలో కరోనా ఆక్టివ్ కేసుల శాతం 28.21 శాతం ఉండగా..కోలుకుంటున్నవారి శాతం 9.80 గా ఉంది. ఇక మరణాల రేటు 1.99 శాతంగా ఉందని తెలిపింది.