- ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.
మహ్మద్ సిరాజ్‌తో పాటు షూటర్ ఈషా సింగ్, రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌లకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాలను కేటాయిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సిరాజ్, నిఖత్ జరీన్‌లకు ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాలను కూడా ప్రకటించింది.
