
రాజన్నసిరిసిల్ల, వెలుగు: దైవదర్శనాలకు సిరిసిల్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు తెలిపారు. ఆదివారం ఉదయం సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి యాదగిరిగుట్ట, సురేంద్రపురి, బంగారు శివలింగం, స్వర్ణగిరి దేవాలయాలకు వెళ్లే డీలక్స్ బస్సును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఈ ప్రత్యేక బస్సును నడపనున్నట్లు చెప్పారు.
ఈ ఒక్కరోజు టూర్ ప్యాకేజీ టికెట్ ధర పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.450గా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో చిలుకూరు బాలాజీ, భద్రాచలం, పంచరామాలు, సింహాచలం , అన్నవరం , రామప్ప, లక్నవరం లాంటి దర్శనీయ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 90634 03971, 99592 25929ను సంప్రదించాలన్నారు.