రోడ్ వైడింగ్ ను పట్టించుకోని అధికారులు..ప్రజల అవస్థలు

రోడ్ వైడింగ్ ను పట్టించుకోని అధికారులు..ప్రజల అవస్థలు

సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు: సిరిసిల్ల పెద్ద బజారు ట్రాఫిక్ తో సతమతమవుతోంది. మార్నింగ్, ఈవెనింగ్ పెద్ద బజార్ నుంచి పోవాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బజార్ లో పెద్దఎత్తున దుకాణాలు ఉండడం, వాటి ముందు లోడ్, అన్ లోడింగ్ కోసం లారీలు, వ్యాన్ లుఈ ఆగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో సిరిసిల్ల ప్రజలు పెద్ద బజార్ నుండి వెళ్లాలంటే జంకుతున్నారు. 

పాపులేషన్ డబుల్..

సిరిసిల్ల పట్టణంలో చాలా ఏళ్లుగా పెద్ద బజార్ లో ట్రాఫిక్ సమస్య ఉంది. కాలక్రమేణా పాపులేషన్ డబుల్  కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా మున్సిపల్ పాలకులు పట్టించుకుంటలేరు. పెద్ద బజార్ ట్రాఫిక్ పై పలువురు సిరిసిల్లవాసులు కంప్లైట్ చేసినప్పుడుల్లా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం నెల రోజుల్లో ఎత్తేస్తున్నారు. 

రోడ్ వైడింగ్ చేయాలి..

పెద్ద బజార్​లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలంటే రోడ్ వైండింగ్ ఒక్కటే మార్గం. అయితే మున్సిపల్ ఎన్నికల ముందు లీడర్లు పెద్ద బజార్ ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని, రోడ్ వైండింగ్ చేపడతామని చెప్పడమే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. గతేడాది మున్సిపల్ ఆఫీసర్లు రోడ్ వైండింగ్ కోసం దుకాణాలకు మార్కింగ్ చేశారు. కానీ ఇప్పటి వరకు వైండింగ్ చేయలేదు. బడా వ్యాపారస్తులకు నష్టం జరగకూడదనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటలేరని, రోడ్డు వెడల్పుకు చేయడానికి మొగ్గు చూపడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గాంధీ చౌక్ లోనూ ఇదే సమస్య..

సిరిసిల్ల గాంధీ చౌక్ లో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఆఫీసర్లును నియమించకపోవడం, గాంధీ ఏరియాలో మార్కెట్ తోపాటు పెద్ద దుకాణాల సముదాయం ఉండటం, నాలుగు రోడ్ల కలయిక ఉండటంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అలాగే విమల్ థియేటర్ నుంచి పెద్ద బజార్ నుంచి గాంధీ వరకు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

బైక్ పై వెళ్లాంటే  భయమైతుంది

పెద్ద బజార్ లో బైక్ పై వెళ్లాలంటే ఓ సవాలే. పెద్ద వెహికల్స్​దుకాణాల ముందు నిలపడంతో రాకపోకలు కష్టమైతంది. అలాగే సిద్ధార్థ నగర్ నుంచి పనుల నిమిత్తం గాంధీ ఏరియాకు పోవాలంటే పెద్ద బజార్ నుంచే పోవాలి. అధికారులు సమస్యను పరిష్కరించాలి.
- అన్నల్​దాస్ వేణు, సిరిసిల్ల

రోడ్ వైండింగ్ చేయాలి

పెద్ద బజార్ ట్రాఫిక్ సమస్య పోవాలంటే రోడ్ వైండింగ్ చేపట్టాలి. ప్రజల ఇబ్బందులు పాలకులకు కనబడవా. మినిస్టర్ కేటీఆర్ సిరిసిల్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నం అని చెబుతున్నారు. మా ఇబ్బందులను టీఆర్ఎస్ లీడర్లు పట్టించుకోరా.? తక్షణం స్పందించి ​సమస్యను పరిష్కరించాలి.
- బియ్యంకార్​ శ్రీనివాస్, సిరిసిల్ల