తమ్ముడా.. నిన్ను మరువం! వీరజవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన అక్కలు

తమ్ముడా.. నిన్ను మరువం! వీరజవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన అక్కలు

కోహెడ(హుస్నాబాద్): చనిపోయిన తమ్ముడి విగ్రహానికి అక్కలు రాఖీ కట్టి తమ ఆత్మీయ బంధాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దుబ్బతండా పరిధి రాజు తండాకు చెందిన గుగులోతు లింగయ్య, -వీరమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు నరసింహ నాయక్ ఉన్నారు. సీఆర్పీఎఫ్​జవాన్​గా నరసింహనాయక్  విధులు నిర్వహిస్తూ 2014లో చత్తీస్​గఢ్​ లో మావోయిస్టుల మందుపాతర పేలుడులో మృతిచెందాడు.  దీంతో కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్ద అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రాఖీ పండుగ రోజున తమ్ముడి విగ్రహానికి ముగ్గురు అక్కలు రాఖీ కడుతూ తమ్ముడిపై తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు.