TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ ఛార్జ్‎షీట్

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ ఛార్జ్‎షీట్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.  తాజాగా  కోర్టులో ఛార్జ్‎షీట్  దాఖాలు చేసింది సిట్. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 49 మంది అరెస్ట్ చేసిన సిట్..   16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారని గుర్తించింది.  మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్ లో ఉన్నాడని తెలిపింది.  

పేపర్ లీకేజీలో ఇప్పటి వరకు 1.63కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తి్ంచామని సిట్ ఛార్జ్‎షీట్ లో తెలిపింది. డీఏఓ ప్రశ్నాపత్రం  8 మంది అభ్యర్థులకు, ఏఈ ప్రశ్నాపత్రం 13మందికి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ నలుగురికి,  ఏఈఈ ప్రశ్నాపత్రం 7 మందికి లీకైనట్లుగా సిట్ ఛార్జ్‎షీట్ లో పేర్కొంది. ఇక ఏఈఈ పరీక్షలో ముగ్గురు చూచిరాతకు పాల్పడినట్లుగా ఛార్జ్‎షీట్ లో సిట్  వెల్లడించింది.

 నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైళ్లు, ఇతర పరికరాలను  రామాంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికి పంపించామని  సిట్ ఛార్జ్‎షీట్ లో పేర్కొంది.