సృష్టి కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం..నిందితులను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్

సృష్టి కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం..నిందితులను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సరోగసి ముసుగులో శిశువుల అక్రమ విక్రయ వ్యవహారంతో ఈ కేంద్రంపై మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి.  ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతతో పాటు మొత్తం 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, ఈ కేసులో కీలక నిందితులైన డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత కృష్ణ, సదానందం, చెన్నారావులను రెండు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.

 గతంలో సికింద్రాబాద్‌‌లోని గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును ఇప్పుడు సిట్‌‌కు బదిలీ చేశారు. డాక్టర్ నమ్రత నిర్వహించిన ఈ సరోగసి మోసంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై సిట్ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.