హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ కీలక సాక్ష్యాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి శుక్రవారం సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరుకావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేస్తున్నది.
ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ నంబర్లు కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించిన అధికారులు, ఆయనను విచారణకు పిలిచారు. టెలికాం సంస్థలు అందించిన వివరాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్‌కు గురైన ప్రజాప్రతినిధులు, ఇతర బాధితుల స్టేట్‌మెంట్లను సిట్ సేకరిస్తోంది. ప్రస్తుతం ఆయన వాంగ్మూలాన్ని కూడా సిట్ నమోదు చేయనుంది.
