ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ సిట్

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ సిట్

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‎లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు శనివారం (జూన్ 13) తుమ్మల నివాసానికి వెళ్లిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మంత్రి తుమ్మల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.   

ఫోన్ ట్యాపింగ్ కేసు..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) ఆధ్వర్యంలో రాజకీయ ప్రత్యర్థులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, అసమ్మతివాదుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిన ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. స్టేట్ పాలిటిక్స్‎ను షేక్ చేసిన ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, హరీష్ రావు, కేటీఆర్‎తో పలువురుని సిట్ విచారించి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. తాజాగా ఈ కేసులో మంత్రి తుమ్మల వాంగ్మూలం నమోదు చేయడం గమనార్హం. 

ALSO READ : పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు ప్రతిష్టాత్మక అవార్డ్