
మహేష్ బాబు(Mahesh Babu) కూతురు సితార(Sitara) మనసు ఆకాశం అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంది.రీసెంట్ గా తన బర్త్ డే స్పెషల్ గా (జూలై 20న) తన తండ్రి మహేష్ ఫౌండేషన్ లోని అమ్మాయిలతో సరదాగా గడిపి వారికి సైకిల్స్ ను అందించింది. అలాగే ఓ జ్యూవెలరీ యాడ్ కోసం దాదాపు రూ. కోటి రెమ్యూనరేషన్ అందుకుని, అమౌంట్ మొత్తాన్ని సితార ఛారిటీ కి ఇవ్వడం విశేషం.
ఇవాళ (ఆగస్ట్ 17న) మహేష్ బాబు ఇంట్లో గత ఏడేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకున్నపెట్ డాగ్(ప్లూటో) చనిపోయింది.సితార ఎప్పుడు ప్లూటోతో ఎంతో చక్కగా ఆడుకుంటుందని సమాచారం.ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న ప్లూటో మృతి చెందడంతో నమ్రత శిరోద్కర్, కూతురు సితార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
ఈ మేరకు సితార తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చేసిన ‘ఏడేళ్ల బంధం.. మిస్ యూ ప్లూటో’’ అంటూ షేర్ చేయగా.. దానికి స్పందించిన నమ్రత.. ‘‘ప్లూటో ఎక్కడికి వెళ్లదు.. మనతోనే, మన ప్రార్థనలో ఎప్పటికీ మనతోనే ఉంటుంది’’ అంటూ సితారకు ధైర్యం చెప్పింది. అంతే కాకుండా.. ఘట్టమనేని అభిమానులు సైతం ఆ పోస్ట్‌కు రిప్లైలు పెడుతున్నారు.
ఈ నెల (ఆగస్టు 9న) మహేష్ బాబు తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు. మహేష్ తన ఫ్యామిలీతో స్కాట్లాండ్ ట్రిప్ లో ఎంజాయ్ చేసిన ఫొటోస్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేశ్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో 'గుంటూరు కారం(Gunturu kaaram)' మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెర వేగంగా జరుగుతోంది. గుంటూరు కారం సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీలో మహేష్ బాబు నటించబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.