మహేష్ బాబు కూతురా.. మజాకా.. సితార రేర్ ఫీట్

మహేష్ బాబు కూతురా.. మజాకా.. సితార రేర్ ఫీట్

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు కూతురు సితారకు సోషల్​ మీడియాలో ఉన్న ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్​ చేస్తూ మహేశ్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది. సితార క్రేజ్​ను క్యాష్​ చేసుకునేందుకు ఇప్పటికే కంపెనీలు పోటీ పడుతున్నాయి. నమ్రతతో కలిసి ఈ ఇటీవల ఈ స్టార్ కిడ్​ ఓ యాడ్​లో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ జ్యువెల్లర్స్​కు బ్రాండ్​ అంబాసిడర్​గా మారినట్టు సమాచారం. 

బడా యాడ్​ ఫిల్మ్​ మేకర్స్, అత్యున్నత టెక్నీషియన్స్​తో ఈ యాడ్​ ప్లాన్​ చేశారట. ఇందుకోసం ఓ రహస్యప్రాంతంలో రెండు రోజుల పాటు షూటింగ్​ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్​లో అత్యధిక కమర్షియల్​ యాడ్స్ చేసిన హీరోగా మహేశ్​కు పేరుంది. ఇప్పుడు తండ్రిబాటలోనే సితార వెళ్లనున్నట్టు ఇండస్ట్రీలో టాక్​ నడుస్తోంది.