
మహేశ్ బాబు(Mahesh Babu) కుమార్తె సితార(Sithara) తండ్రిని మించిన తనయగా పేరు తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఎంతో మంది సితారను తమ యాడ్స్‌లో నటింపజేయాలని నమ్రతను సంప్రదించారట. కానీ మహేశ్, నమ్రత(Namrata) లు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
ఇటీవల ఓ జ్యువెల్లరీ యాడ్(Jewellery Ad) కి మాత్రం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా దీనిని న్యూయార్క్(New York ) లోని టైమ్ స్క్వేర్(Times Square) పై ప్రదర్శించడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకోసం ఈ స్టార్ కిడ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఈ యాడ్ కోసం ఏకంగా రూ. కోటి సమర్పించుకున్నారట. మహేశ్ బాబు కూడా తన తొలి యాడ్‌కు ఇంత తీసుకుని ఉండడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంత చిన్న వయసులోనే సెలబ్రిటీలను తలదన్నేలా పారితోషకం అందుకుంటూ సితార అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.