భవ్య, వైష్ణవి మృతిపైసిట్టింగ్ ​జడ్జితోవిచారించాలి

భవ్య, వైష్ణవి మృతిపైసిట్టింగ్ ​జడ్జితోవిచారించాలి

ఖైరతాబాద్​,వెలుగు: భువనగిరిలోని ప్రభుత్వ హాస్టల్ లో చదివే టెన్త్ విద్యార్థులు భవ్య,వైష్ణవిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, హాస్టల్ వార్డెన్​శైలజ, ఆటో డ్రైవర్​ఆంజనేయులు, వంటమనిషి సుజాత, పీఈటీ ప్రతిభ పై ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మంగళవారం మీడియా సమావేశంలో బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు వాసు కె. యాదవ్​మాట్లాడుతూ ఇందిరాపార్క్​వద్ద ధర్నా చేపడతామని దోమలగూడ పోలీసులను అనుమతి కోరితే ఇస్తామన్నారని పేర్కొన్నారు.  దీంతో ధర్నా చేసేందుకు వస్తే అరెస్టు చేసినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దోమల్​గూడ సీఐ శ్రీనివాస్​రెడ్డి తనను దూషించి దుర్బాషలాడారని, ఆయన నుంచి తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. హాస్టల్ లో చదివే  తమ బిడ్డలను చంపి ఆత్మహత్యలుగా చిత్రీకరించారని ఆరోపించారు. హత్యలు వెనుక పెద్దల హస్తం ఉందని, సిటింగ్​జడ్జితో విచారణ చేయించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాన్​కుమార్​, రోజా నేత, అభినవ్,​భవ్య తండ్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.