భారత్ పరిస్థితి చూసి నా గుండె పగిలింది

భారత్ పరిస్థితి చూసి నా గుండె పగిలింది

జెనీవా: భారత్‌లో కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులను చూస్తుంటే హృదయం బద్దలైపోతోందని డబ్ల్యూహెచ్‌‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అన్నారు. ఇండియాకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు డబ్ల్యూహెచ్‌వో రంగంలోకి దిగిందన్నారు. ఈ ఆపత్కాలంలో భారత్‌‌ను అన్ని విధాలుగా ఆదుకునేందకు యత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే క్రిటికల్ ఎక్విప్‌‌మెంట్ సప్లయ్‌‌ను పంపామన్నారు. అక్కడి హెల్త్ అథారిటీస్‌తో కలసి పని చేసేందుకు సంస్థకు చెందిన పలు ప్రోగ్రామర్లను పంపించినట్లు తెలిపారు. ఇండియాకు సాయంగా  యూఎన్ హెల్త్ ఏజెన్సీ ఆక్సిజన్ కాన్‌‌సన్‌‌ట్రేటర్స్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ ఫీల్డ్ హాస్పిటల్స్‌, లేబొరేటరీ సప్లయ్‌‌ను ఎగుమతి చేసిందన్నారు.