డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి ఉద్రిక్తం

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి ఉద్రిక్తం

పిట్లం, వెలుగు: పేదలకు డబుల్ ​బెడ్రూం​ ఇండ్లు కట్టించాలని కోరుతూ బుధవారం  బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన  కామారెడ్డి జిల్లా జుక్కల్​ ఎమ్మెల్యే హన్మంత్​షిండే  ఇంటిముట్టడి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న బీఆర్ఎస్ ​కార్యకర్తలు అడ్డుకోవడంతో  పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టగా, బీజేవైఎం మండల ప్రెసిడెంట్​ శెట్​పల్లి విష్ణు, కార్యకర్తలు సంజీవ్ పాటిల్, జాదవ్​పండరి నాయక్, గంగాధర్, గోపాల్​చారి, శివాజీ పటేల్, పీరాజీ, రమేశ్​తదితరులకు గాయాలయ్యాయి.

వీరిని స్థానిక గవర్నమెంట్​హాస్పిటల్​కు తీసుకెళ్లి ట్రీట్​మెంట్​అందించారు. శెట్​పల్లి  విష్ణు మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదేండ్లలో  పక్క నియోజకవర్గంలో వేల ఇండ్లు కట్టారని, జుక్కల్​నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించడానికే ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నిస్తే, దాడి చేయడం కరెక్ట్​ కాదన్నారు. పోలీసులు కేవలం బీజేపీ కార్యకర్తలపైనే లాఠీచార్జి చేశారని ఆరోపించారు.   

కామారెడ్డి టౌన్: గత ఎన్నికల టైమ్​లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ బుధవారం బీజేపీ  ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసును బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. ర్యాలీగా క్యాంప్​ఆఫీస్​వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, మెయిన్​రోడ్​పై బారీ కేడ్లు పెట్టి పోలీసులు అడ్డగించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​చేశారు. మున్సిపల్ ఫ్లోర్​లీడర్​శ్రీకాంత్, టౌన్​ప్రెసిడెంట్​ విఫుల్​   తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ: బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి మల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ను ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆఫీస్​ వరకు ర్యాలీ తీశారు. అసెంబ్లీ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్, ఓబీసీ మోర్చా జిల్లా  ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.