శివ కార్తికేయన్ ఏలియన్ విత్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్

శివ కార్తికేయన్ ఏలియన్ విత్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్

శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్‌‌‌‌సింగ్ జంటగా  ఆర్. రవికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘అయలాన్’. సంక్రాంతి సందర్భంగా తమిళనాట విడుదలైన ఈ చిత్రం, ఈరోజు తెలుగు ఆడియెన్స్ ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ప్రూవ్ చేసుకున్న శివ కార్తికేయన్ నాలాంటి వారికి ఇన్‌‌‌‌స్పిరేషన్. ఈ సినిమా చూసి చిన్నపిల్లలు ఆయనకు ఫ్యాన్స్ అవుతారు’ అని చెప్పాడు. 

దర్శకులు గోపీచంద్ మలినేని, మల్లిడి వశిష్ఠ ఈవెంట్‌‌‌‌కు హాజరై టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ ‘ఇదొక సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్.  నేను, ఏలియన్ కలిసి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తాం. ఇండియన్ సినిమాలో ఇది ఒక కొత్త ప్రయత్నం. ఇలాంటివి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సంక్రాంతికి విడుదలైన 'హనుమాన్' తరహాలోనే  ఇది కూడా పిల్లలు, ఫ్యామిలీస్ అందర్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుంది’ అని చెప్పాడు. ఈ ఏలియన్ జానర్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ అందరికీ నచ్చుతుందన్నాడు దర్శకుడు రవికుమార్. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందన్నారు నిర్మాత మహేశ్వర్ రెడ్డి.  లిరిసిస్టులు రామజోగయ్య శాస్త్రి, రాకేందు మౌళి పాల్గొన్నారు.