మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ సినిమా

మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్  సినిమా

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. మురుగదాస్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెళ్లి కలిసి విషెస్ చెప్పిన శివకార్తికేయన్.. ఆ ఫొటోలను షేర్ చేస్తూ ఈ సినిమా గురించి రివీల్ చేశాడు. శివకార్తికేయన్ కెరీర్‌‌‌‌లో ఇది 23వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇక గతంలో శివకార్తికేయన్ హీరోగా ‘మాన్‌‌ కరాటే’ చిత్రాన్ని మురుగదాస్ నిర్మిం చారు.