ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కలకలం
  • దళంలో చేరేందుకు వెళ్తున్న ఆరుగురి అరెస్ట్ 

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆరుగురు పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించగా మావోయిస్టుల దళంలో చేరేందుకు వెళ్తున్నట్లు గుర్తించారు. పట్టుపడిన నిందితుల దగ్గరి నుంచి రెండు బైకులు,  5 సెల్ ఫోన్లు, 27 జిలెటిన్ స్టిక్స్ , 53 డిటో నేటర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మురళిగూడకు చెందిన హన్మంతుకు 1987 నుంచి మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.